అమెరికాలోని Denver International Airportలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న Frontier Airlinesకు చెందిన Airbus A321 విమానం సమీపంలోకి ఓ వ్యక్తి అకస్మాత్తుగా భద్రతా కంచె దాటి రన్‌వేపైకి చేరుకున్నాడు. ఆ సమయంలో వేగంగా కదులుతున్న విమానం ఇంజిన్ శక్తివంతమైన గాలివేగంతో అతడిని లోపలికి లాగేసుకుంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం ప్రకారం, ప్రమాదం సంభవించిన వేళ విమానం గంటకు దాదాపు 139 మైళ్ల వేగంతో ముందుకు సాగుతోంది. వ్యక్తి శరీరం ఇంజిన్‌లో చిక్కుకుపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా విమానాశ్రయంలో కలకలం రేగింది.
విమానంలో ఉన్న ప్రయాణికులు ఇంజిన్ భాగం వద్ద అసాధారణ పరిస్థితిని గమనించి భయాందోళనకు గురయ్యారు. కొందరికి ఇంజిన్ వెలుపల మనిషి కాళ్లు కనిపించగా, పెద్ద శబ్దాలతో పాటు మంటలు రావడం పరిస్థితిని మరింత భయానకంగా మార్చింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు టేకాఫ్ ప్రక్రియను నిలిపివేసి, ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
https://x.com/i/status/2053569261075833126
