
మలయాళ స్టార్ హీరో Mohanlal ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విడుదలతో ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకుల్లో నెలకొన్న సందేహాలకు సమాధానం లభించింది. గతంలో వచ్చిన రెండు భాగాల మాదిరిగా వెంకటేష్‌తో రీమేక్ కాకుండా, ఈసారి ఒరిజినల్ మలయాళ చిత్రాన్నే తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నారు.
దర్శకుడు Jeethu Joseph ఈ భాగాన్ని మరింత ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దినట్టు ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. గత కథల్లో జార్జ్‌కుట్టికి ఎదురయ్యే ప్రమాదాలు తెలిసి ఉండేవి. అయితే ఈసారి తనను వెంటాడుతున్నది ఎవరో తెలియని పరిస్థితిలో అతను పడే మానసిక ఒత్తిడి కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా మే 21న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ట్రైలర్లో కనిపించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ, జార్జ్‌కుట్టి కథ ఇంకా ముగియలేదని చెప్పి అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేశారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే భవిష్యత్తులో ‘దృశ్యం 4’ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
