
యువ హీరో వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ‘నయనం’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన దర్శకురాలు స్వాతి ప్రకాశ్ మంత్రిప్రగడ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాను ఆహా సమర్పణలో కొమర మీడియా వర్క్స్ పతాకంపై శివ కంఠంనేని, ఆర్. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ ప్రారంభ వేడుకలో నటుడు-నిర్మాత, ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు నీలకంఠ గౌరవ దర్శకత్వం వహించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. “సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో సస్పెన్స్‌తో కూడిన అందమైన ప్రేమకథగా ‘నా వైఫ్ మిస్సింగ్’ రూపొందుతోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా కథనం ఉంటుంది” అని వెల్లడించింది.ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తుండగా, సతీష్ కుమార్ ఎన్ఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ సినిమా వరుణ్ సందేశ్ కెరీర్లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
