
తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ పరారీలో ఉండటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar నైతిక బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలని సూచించారు. అలా చేస్తే ఆయన వ్యక్తిత్వానికి మరింత గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఏ కేసు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిజానిజాలు బయటపెట్టాలని, పరారీలో ఉండటం వల్ల సమస్యలు మరింత క్లిష్టమవుతాయని సీఎం స్పష్టం చేశారు.
బండి సంజయ్ కష్టపడి రాజకీయంగా ఎదిగిన నాయకుడని, అయితే కుమారుడి వ్యవహారం కారణంగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తప్పు చేసినా, చేయకపోయినా చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
ఈ నేపథ్యంలో వెంటనే కుమారుడిని పోలీస్ స్టేషన్లో హాజరు పరచాలని సూచించిన సీఎం, కేసులో ఎవరి తప్పు ఎంతుందో విచారణ సంస్థలు తేలుస్తాయని చెప్పారు.
